News November 13, 2024
రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు
Similar News
News December 10, 2024
హమాస్ వినాశనమే మా లక్ష్యం: నెతన్యాహు
తాము యుద్ధం ముగిస్తే హమాస్ తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అందుకే తాము యుద్ధం విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి 14 నెలలు పూర్తైన సందర్భంగా నెతన్యాహు మాట్లాడారు. ‘యుద్ధాన్ని ఆపితే హమాస్ కోలుకుని మళ్లీ బలపడుతుంది. అందుకే దాని సైనిక, పరిపాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తా. భవిష్యత్‌లో మాపై దాడులు జరగకుండా చేస్తా. హమాస్ వినాశనమే మా టార్గెట్’ అని ఆయన పేర్కొన్నారు.
News December 10, 2024
అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు వస్తారు?
TG: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న తొలి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో ‘ఆయన ఇక ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారా? తమ పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కాలం గడిపేస్తారా?’ అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఈనెల 16 నుంచి కొనసాగే సమావేశాలకైనా ఆయన వస్తారేమో చూడాలి.
News December 10, 2024
మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.