News July 20, 2024

జ్యూస్ షాప్‌ కోసం పట్టభద్రులు కావలెను!

image

జ్యూస్ షాప్‌లో పనిచేసేందుకు అర్హతలేంటి? జ్యూస్ చేయడం వస్తే చాలంటారా? కాదు డిగ్రీ కూడా ఉండాలంటున్నారు తమిళనాడుకు చెందిన ఓ షాప్ యజమాని. దుకాణంలో పనిచేసేందుకు బీఈ, బీఏ, బీఎస్సీ చదివిన వారు కావాలని, రూ.18వేలు జీతమిస్తామని ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పని ఉంటుందట. తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar News

News December 12, 2024

క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!

image

రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

News December 12, 2024

ప్రపంచంలోనే అరుదైన రక్తం ఇదే!

image

ప్రపంచంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ Rh-null అనేది అరుదైన రక్త సమూహంగా పరిగణిస్తుంటారు. దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే తక్కువ మంది మాత్రమే ఈ ప్రత్యేకమైన రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు. ఇది అరుదుగా ఉండటం వల్ల దీనిని విలువైనదిగా భావిస్తారు. యాంటీజెన్స్ ఉండవు కాబట్టి Rh వర్గం వారికి వినియోగించాల్సి వచ్చినపుడు దీని మ్యాచ్‌ను కనుగొనడం చాలా కష్టం.

News December 12, 2024

100 రోజుల యాక్షన్ ప్లాన్: లోకేశ్

image

ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.