News March 20, 2024

వచ్చే నెల 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు?

image

TG: యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్‌లో 60-70లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి ₹2,203, సాధారణ రకానికి ₹2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.

Similar News

News September 19, 2024

వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల విరాళం

image

AP: విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.25 కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ‘ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు.

News September 19, 2024

అశ్విన్ హాఫ్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.

News September 19, 2024

YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని

image

AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.