News December 3, 2024
జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు

TG: జనవరి 10 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు తొందరపడి బయట అమ్ముకొని నష్టపోవద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33,15,426 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 4,68,874 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్ టాప్లో ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.6.347.40కోట్లు చెల్లించినట్లు, రూ.1,344 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News November 1, 2025
షట్డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో $7 బిలియన్లు ఆవిరి

అమెరికా గవర్నమెంట్ <<17882827>>షట్డౌన్ <<>>సంక్షోభం మరింత ముదురుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా $7 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై అంత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. షట్డౌన్ ఆరు వారాలు కొనసాగితే $11 బిలియన్లకు, 8 వారాలు కొనసాగితే $14 బిలియన్లకు నష్టాలు పెరుగుతాయని హెచ్చరించింది.
News November 1, 2025
ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్పుట్స్తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.
News November 1, 2025
సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT


