News April 5, 2024

దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు: KCR

image

తెలంగాణలో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ‘మేం కరీంనగర్ జిల్లాకు నాలుగైదు జలధారలు సృష్టించాం. అవి ఇప్పుడు ఎండిపోయాయి. గోదావరి ఎడారిగా మారింది. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత వల్లే కరవు వచ్చింది. 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయింది. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్లే కరవు వచ్చిందని చెబుతున్నారు. అది అబద్ధం’ అని మండిపడ్డారు.

Similar News

News January 19, 2025

నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా..

image

AP: గతేడాది తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రకటించారు. తాజాగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) రూ.70 లక్షల విలువైన రెండు పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబులో అమర్చారు. వీటితో నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించవచ్చు.

News January 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.

News January 19, 2025

100 మందిలో ఒకరికి క్యాన్సర్!

image

AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.