News March 29, 2024
సమరయోధుడి మనవడు.. 60 కేసుల్లో నిందితుడు
UP గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ(60) జైలులో గుండెపోటుతో <<12945657>>మరణించడం<<>> చర్చనీయాంశంగా మారింది. ఆయన విషప్రయోగం వల్లే చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ కో ఫౌండర్ ముఖ్తార్ అహ్మద్ మనవడైన ఈయనపై 60 క్రిమినల్ కేసులున్నాయి. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నకిలీ తుపాకీ లైసెన్స్ కేసులో శిక్ష అనుభవిస్తూ మరణించారు.
Similar News
News January 16, 2025
తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్‌టాక్‌లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
News January 16, 2025
‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News January 16, 2025
కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)
రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.