News January 24, 2025
20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Similar News
News January 25, 2025
నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల
ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
News January 25, 2025
దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్
AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.
News January 25, 2025
MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.