News August 9, 2024

GREAT: ట్యూషన్లు చెబుతూ చదువుకుని 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: పేదరికం వెంటాడుతున్నా ఆ యువతి వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ స్కూల్‌లో చదివి స్కాలర్‌షిప్‌లతో ఉన్నత విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత HYDలో హోం ట్యూషన్స్ చెబుతూ కోచింగ్ తీసుకోకుండానే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. సూర్యాపేట(D) పాతదొనబండ తండాకు చెందిన భూక్యా మౌనిక విజయ గాథ ఇది. రైల్వేలో క్యారేజ్& వ్యాగన్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గ్రూప్-4 ఆరో ర్యాంక్, పంచాయతీరాజ్ శాఖలో AEEగా ఈమె ఎంపికయ్యారు.

Similar News

News November 19, 2025

అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

image

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.