News November 25, 2024
Great.. 5 ప్రభుత్వ ఉద్యోగాలు
కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన రాజశేఖర్ ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. TGT, PGT, జూనియర్ లెక్చరర్, గ్రూప్-4, టీజీపీఎస్సీ ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం గంగాధర వెల్ఫేర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్న ఇతను ప్రతి పరీక్షను సవాలుగా తీసుకొని చదవడంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తే ఉద్యోగ సాధన సులభమని చెబుతున్నారు.
Similar News
News December 12, 2024
అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు.. రేపు లాటరీ
AP: అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని కార్యాలయంలో డిసెంబర్ 12న లాటరీ తీయనున్నట్లు CRDA కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సూచించారు.
News December 12, 2024
నేటి ముఖ్యాంశాలు
* APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఇసుక విషయంలో అధికారులదే బాధ్యత: పవన్ కళ్యాణ్
* ఇంటర్, SSC పరీక్షల షెడ్యూల్ విడుదల
* TG: మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్
* కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్
* సీపీ విచారణకు మంచు విష్ణు, మనోజ్ హాజరు
* ఈ నెల 24 వరకు విచారణకు హాజరవ్వకుండా మోహన్ బాబుకు ఊరట
* రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటిన ‘పుష్ప-2’
News December 12, 2024
కాబూల్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనితో సహా 12 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను తాలిబన్ మీడియా రిలీజ్ చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.