News July 19, 2024

GREAT: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

image

కరోనా కష్టకాలంలో వేల మందికి అండగా నిలిచిన నటుడు సోనూసూద్. తాజాగా ఏపీలోని బనవనూరుకు చెందిన దేవీకుమారి అనే అమ్మాయి చదువుకునేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువతి ఆర్థిక పరిస్థితి బాలేదని BSC చదివేందుకు సాయం కావాలని ఫ్యామిలీతో అభ్యర్థిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ‘ఆమెకు నచ్చిన కాలేజీలో చేరేలా చూసుకుంటాను’ అని సోనూ రిప్లై ఇచ్చారు.

Similar News

News December 12, 2024

సినిమా షూటింగ్‌లో గాయపడ్డ అక్షయ్ కుమార్‌!

image

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్-5’ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు తెలిపాయి. సిబ్బంది వెంటనే నేత్ర వైద్యుడిని సెట్స్‌కి పిలిపించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారని తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.

News December 12, 2024

గ్రేట్.. తొమ్మిది నెలల గర్భంతో భరతనాట్యం

image

భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.

News December 12, 2024

ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.