News January 30, 2025
Great: ఒకరోజు వయసున్న శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్

ఢిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు అద్భుతం చేశారు. ఒక్కరోజు వయసున్న UP, బరేలీ నవజాత శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశారు. 20 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‌లో డాక్లర్లు కడుపులోని బిడ్డకు TGA గుండెజబ్బును గుర్తించారు. అంటే రంధ్రంతో పాటు ధమనులు తిరగేసి ఉంటాయి. శిశువు జన్మించగానే వారు 3 గంటలు శ్రమించి సర్జరీ చేశారు. 16 రోజుల తర్వాత ఇంటికి పంపించారు.
Similar News
News February 11, 2025
అమరావతికి రూ.11వేల కోట్ల రుణం.. హడ్కో గ్రీన్ సిగ్నల్

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
News February 11, 2025
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.