News August 3, 2024
GREAT: పిల్లల ఆకలి తల్లికే తెలుస్తుంది!
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో అనాథలైన నవజాత శిశువులకు పాలిచ్చేందుకు కేరళలోని ఇడుక్కికి చెందిన భావన సజిన్ ముందుకొచ్చారు. పాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట పోస్ట్ చేయగా వయనాడ్ నుంచి ఇద్దరు కాల్స్ చేశారు. దీంతో 350kms ప్రయాణించి సహాయ శిబిరానికి చేరుకోగా కాల్స్ చేసిన వారు స్పందించలేదు. అయినప్పటికీ తాము ఇక్కడే ఉండి సహాయం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆమె తెలిపారు.
Similar News
News September 18, 2024
ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: CPI నారాయణ
AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 18, 2024
పాలకులు మారినా విధానాలు కొనసాగుతాయి: సీఎం రేవంత్
TG: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టి గొప్ప ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు మారినా విధానాలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొస్తే, వైఎస్ఆర్ దానిని కొనసాగించారన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సంస్కరణల వల్లే ఐటీ, ఫార్మా రంగాల్లో నం.1గా ఉన్నామన్నారు.
News September 18, 2024
WOW.. పంచెకట్టులో బాలయ్య
నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘NBK109’ సినిమా షూటింగ్ స్పాట్‌కు ‘పైలం పిలగా’ చిత్రయూనిట్ వెళ్లింది. ఈనెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్‌ను బాలయ్యకు చూపించారు. ఈ సందర్భంగా పంచెకట్టులో హ్యాండ్సమ్‌గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజురోజుకూ యూత్‌గా మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.