News July 25, 2024
గ్రేట్.. సైబర్ క్రైమ్ బాధితురాలికి సత్వర న్యాయం

ఎలాంటి FIR, పిటిషన్ లేకుండానే బాధితురాలికి సత్వర న్యాయం చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈనెల 11న ఓ ఉద్యోగిణి Housing.comలో డబ్బులు పోగొట్టుకోగా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. స్పందించిన పోలీసులు ఆన్‌లైన్ ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత మర్చంట్ లోకాన్ సొల్యూషన్‌కు నోటీసులు పంపారు. ఆ కంపెనీ లావాదేవీలను బ్లాక్ చేశారు. దీంతో సదరు కంపెనీ ఈరోజు రూ.97,312లు రిఫండ్ చేసిందని పోలీసులు తెలిపారు.
Similar News
News November 14, 2025
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం
News November 14, 2025
జక్కన్న.. ఏం ప్లాన్ చేశావయ్యా?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా SSMB29 నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. దీని కోసం మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాగా ఈవెంట్కు వ్యాఖ్యాతలుగా యాంకర్ సుమతో పాటు యూట్యూబర్ ఆశిష్ వ్యవహరిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారితో రాజమౌళి డిస్కషన్స్ చేస్తున్న ఫొటోలు వైరలవ్వగా ‘ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News November 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


