News July 25, 2024
గ్రేట్.. సైబర్ క్రైమ్ బాధితురాలికి సత్వర న్యాయం
ఎలాంటి FIR, పిటిషన్ లేకుండానే బాధితురాలికి సత్వర న్యాయం చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈనెల 11న ఓ ఉద్యోగిణి Housing.comలో డబ్బులు పోగొట్టుకోగా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. స్పందించిన పోలీసులు ఆన్‌లైన్ ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత మర్చంట్ లోకాన్ సొల్యూషన్‌కు నోటీసులు పంపారు. ఆ కంపెనీ లావాదేవీలను బ్లాక్ చేశారు. దీంతో సదరు కంపెనీ ఈరోజు రూ.97,312లు రిఫండ్ చేసిందని పోలీసులు తెలిపారు.
Similar News
News December 5, 2024
నేడు ముంబైకి సీఎం చంద్రబాబు
AP: మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. కాగా చంద్రబాబు పర్యటనల కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నియమితులయ్యారు. గతంలో చంద్రబాబు ఎన్నికల పర్యటనలను కూడా ఈయనే చూసుకున్నారు.
News December 5, 2024
అమ్మాయిలు అలాంటివాడినే ప్రేమిస్తున్నారు: షాహిద్
నేటి తరం అమ్మాయిలు కబీర్ సింగ్(తెలుగులో అర్జున్ రెడ్డి) వంటి అబ్బాయిల్నే ప్రేమిస్తున్నారని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కబీర్ పాత్రని నేను కచ్చితంగా ఇష్టపడను. కానీ అలాంటి వారు సొసైటీలో ఉన్నారు. ఆ పాత్ర చేసే అనేక పనులు ఆమోదయోగ్యం కాదు. అయితే, చాలామంది అమ్మాయిలు అలాంటి వాళ్లను ప్రేమిస్తున్నారు. అందుకే ఆ సినిమా చేశాం. చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టం’ అని పేర్కొన్నారు.
News December 5, 2024
మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన
మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.