News August 20, 2024

గ్రేట్.. కారు 10 లక్షల కి.మీలు తిరిగింది!

image

కారు 4-5 లక్షల కి.మీలు తిరగడమే ఎక్కువ. కానీ, ఓ కారు ఏకంగా 10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. కెనడాలోని అంటారియోకు చెందిన 38 ఏళ్ల ఇండియన్ అరుణ్ ఘోష్ 2014 మోడల్ హోండా అకార్డ్ కారును 2017లో సెకండ్ హ్యాండ్‌లో కొన్నాడు. అప్పుడు 90వేల KMS తిరగ్గా డ్రైవింగ్‌పై తనకున్న మక్కువతో దానిని 10 లక్షల కి.మీలు చేశాడు. ఓడోమీటర్ 9,99,999KMS వద్ద ఆగిపోవడంతో తనకోసం ఏడు అంకెలది ఏర్పాటు చేయాలని కంపెనీని కోరాడు.

Similar News

News September 12, 2024

BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్

image

TG: BRS నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ‘BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65. BJP, BRS మా ప్రభుత్వాన్ని 3నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు. దానిపై ఇప్పుడే స్పందించలేను’ అని అన్నారు.

News September 12, 2024

పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN

image

AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.

News September 12, 2024

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు భారత్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. కొరియాపై నేడు జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో గెలుపొంది లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగు పెట్టింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన భారత్, లీగ్ దశలో ఇప్పటి వరకూ ఓడిపోలేదు. హర్మన్‌ప్రీత్ సేన ఈ నెల 14న లీగ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండటం గమనార్హం.