News October 16, 2024

గ్రేట్.. 64 ఏళ్ల వయసులో డాక్టర్ అయ్యేందుకు!

image

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను నిజం చేసుకున్నాడో 64 ఏళ్ల వృద్ధుడు. ఒడిశాకు చెందిన జే కిషోర్ కొన్నేళ్ల క్రితం SBIలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. వైద్యుడవ్వాలనే తన చిరకాల వాంఛను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కష్టపడి చదివి NEET UG-2020లో ప్రవేశం పొందారు. ప్రస్తుతం బుర్లాలో ఉన్న VIMSARలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

Similar News

News November 7, 2024

త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

image

AP: దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే దేవాలయ ట్రస్టుబోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతామూర్తుల మంత్రోచ్చారణ వినిపించాలని పేర్కొన్నారు.

News November 7, 2024

నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: పొంగులేటి

image

TG: తాను ఎవ్వరి కాళ్లు పట్టుకోనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకే ఒక్కసారి పార్టీ కార్యక్రమంలో పెద్దవాడని భావించి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని, రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడుతుందని చెప్పారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తానన్నారు.

News November 7, 2024

SUPER PHOTO.. స్టార్ హీరోలంతా ఒకే చోట

image

సాధారణంగా హీరోలు చాలా అరుదుగా కలుస్తుంటారు. కానీ స్టార్ హీరోలంతా ఒకే చోట భోజనం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ రెస్టారెంట్లో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో ఉపాసన, నమ్రత కూడా ఉన్నారు. దీంతో స్టార్లంతా ఒకే చోట కలిశారని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరంతా ఓ బర్త్ డే వేడుకలో కలిశారని సమాచారం.