News May 18, 2024
గ్రేట్.. పేద విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించాడు
మంచి మార్కులు తెచ్చుకుంటే విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానంటూ విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చాడో వ్యక్తి. ఏపీలోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంకి చెందిన ఉమాపతి అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఆఫర్ ఇచ్చారు. నలుగురు విద్యార్థులు పురుషోత్తం (552), విష్ణు (515), మహా (509), తనూజకు 504 మార్కులొచ్చాయి. వీరితో పాటు స్కూల్ ప్రిన్సిపల్ చెన్నై నుంచి విమానంలో HYDకి తీసుకొచ్చారు.
Similar News
News December 8, 2024
అల్పపీడనం.. భారీ వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
News December 8, 2024
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR
TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.
News December 8, 2024
రెండో వారంలో వరుస IPOలు
స్టాక్ మార్కెట్లలోకి Mon నుంచి IPOలు క్యూకట్టనున్నాయి. ముఖ్యంగా Dec 11న విశాల్ మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ రానున్నాయి. 12న ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, 13న ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ రానున్నాయి. అలాగే SMEలో Dhanlaxmi Crop Science, Jungle Camps India, Toss The Coin, Purple United Sales, Supreme Facility Management, Yash High voltage ఈ వారం IPOకు రానున్నాయి.