News May 15, 2024

ఓటర్ల కోసం రైలుకు గ్రీన్ ఛానల్

image

ఎన్నికల అధికారుల చొరవతో దాదాపు వెయ్యి మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 12న నాందేడ్ నుంచి విశాఖ వస్తున్న రైలు ఆలస్యంగా నడిచింది. పోలింగ్‌కు దూరమవుతామని ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం రైలు ఎక్కడా ఆపకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయించారు. దీంతో రా.8 తర్వాత విశాఖ చేరుకోవాల్సిన ట్రైన్ సా.5.15కే చేరుకోవడంతో కొందరు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.

Similar News

News March 12, 2026

ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

image

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

News March 12, 2026

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన బాలికల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 17 వరకు ధ్రువపత్రాలను పరిశీలించి సీటును కన్ఫామ్ చేస్తారు.

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.