News December 5, 2024

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.

Similar News

News October 31, 2025

కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

image

ఆంధ్రప్రదేశ్‌లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్‌కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం.

News October 31, 2025

కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (2/2)

image

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.

News October 31, 2025

ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి

image

TG: మంత్రి పదవి ఆశిస్తున్న బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించారు. ఆయనను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించారు.