News December 5, 2024
ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.
Similar News
News January 15, 2025
కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?
AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.
News January 15, 2025
కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?
కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.
News January 15, 2025
నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.