News November 5, 2024
నిత్య వివాదాల్లో ‘గృహలక్ష్మి’?
నటి కస్తూరి నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ తమిళ సభలో తెలుగుజాతిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ‘300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. తెలుగువారు తమిళుల బానిసలు’ అని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ బిరుదు వద్దని, రజినీకాంత్ అమెరికా పర్యటనల మిస్టరీ ఏమిటని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Similar News
News December 7, 2024
టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు
ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి’ అని సూచించారు.
News December 7, 2024
బీజేపీ ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ప్రధాని మోదీ, అదానీపై ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థల హస్తం ఉందన్న BJP వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఈ రకమైన ఆరోపణలు నిరుత్సాహకరమైనవని పేర్కొంది. కాగా మీడియా సంస్థ OCCRP, రాహుల్ గాంధీతో అమెరికా జట్టుకట్టిందని BJP ఇటీవల ఆరోపించింది. అందువల్లే OCCRP నివేదికలను చూపుతూ అదానీ, మోదీపై రాహుల్ విమర్శలు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడింది.
News December 7, 2024
ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి
లెబనాన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై జరిపిన వైమానిక దాడిలో 29 మంది మృతి చెందారు. వరుస దాడులతో ఆస్పత్రి పరిసరాలు రక్తపుమడుగులతో నిండినట్టు అల్-జజీరా తెలిపింది. 2023 Oct నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటిదాకా 44,612 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, లక్షకు పైగా గాయపడ్డారు.