News August 16, 2024

గ్రూప్-1 పరీక్ష సమయంలో మార్పులు

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇది వరకు మ.2.30 నుంచి సా.5.30 వరకు అని వెబ్ నోట్ ఇచ్చామని, దాన్ని తాజాగా మ.2 నుంచి సా.5 గంటలకు మార్చినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ నగరంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా, 563 గ్రూప్-1 పోస్టులకు ఈ ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?

image

సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడం శ్రీరామచంద్రుడి కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల ప్రకారం రాముడు సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేయగా అది ఇంద్రలోకానికి చేరినట్టు చెప్తారు. అప్పటి నుంచి ఇది ఆచారంగా కొనసాగుతోంది. ఇక చైనాలో సైనిక అవసరాల కోసం వీటిని రూపొందించారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలలో వేడుకలుగా జరుపుకుంటారు. దీని వలన శరీరానికి, కళ్లకు వ్యాయామం కలుగుతుంది.

News January 13, 2026

జాగ్రత్త.. ఆ వీడియో చూసి స్టాక్స్ కొంటున్నారా?

image

స్టాక్స్ కొనేవారిని BSE అలర్ట్ చేసింది. తమ సీఈవో, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లు కొనాలని రిఫర్ చేస్తున్నట్లు SMలో చక్కర్లు కొడుతున్న వీడియో డీప్‌ఫేక్ అని వెల్లడించింది. తమ అధికారుల్లో ఎవరికీ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత, అనధికార వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT.

News January 13, 2026

భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

image

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.