News August 16, 2024
గ్రూప్-1 పరీక్ష సమయంలో మార్పులు
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇది వరకు మ.2.30 నుంచి సా.5.30 వరకు అని వెబ్ నోట్ ఇచ్చామని, దాన్ని తాజాగా మ.2 నుంచి సా.5 గంటలకు మార్చినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ నగరంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా, 563 గ్రూప్-1 పోస్టులకు ఈ ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించారు.
Similar News
News September 18, 2024
‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?
వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
News September 18, 2024
పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం
AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.
News September 18, 2024
ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్
TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.