News January 21, 2025
గ్రూప్-1 మెయిన్స్: ఈ నగరాల్లోనే సెంటర్లు

AP: గ్రూప్-1 మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ప్రకారం 4,496 మంది <<15215857>>మెయిన్స్ రాసేందుకు<<>> అర్హత సాధించారు. 2023 DECలో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ జరిగింది. మెయిన్స్ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో సెంటర్లు ఏర్పాటు చేశారు.
Similar News
News November 10, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

IAFలో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AFCAT)-2026 <
News November 10, 2025
19న మహిళలకు చీరల పంపిణీ

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.
News November 10, 2025
IVF ప్రక్రియలో దశలివే..

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.


