News January 21, 2025

గ్రూప్-1 మెయిన్స్: ఈ నగరాల్లోనే సెంటర్లు

image

AP: గ్రూప్-1 మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ప్రకారం 4,496 మంది <<15215857>>మెయిన్స్ రాసేందుకు<<>> అర్హత సాధించారు. 2023 DECలో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ జరిగింది. మెయిన్స్ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో సెంటర్లు ఏర్పాటు చేశారు.

Similar News

News February 18, 2025

భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా..!

image

ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్‌రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్‌లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్‌భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

News February 18, 2025

3 నెలలుగా ‘గృహలక్ష్మి’ స్కీమ్ డబ్బుల్లేవ్!

image

కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లలో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకూ బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, త్వరలోనే వేస్తామని Dy CM DK శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని CM సిద్దరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్.

News February 18, 2025

భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

image

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.

error: Content is protected !!