News October 23, 2024

గ్రూప్ 1 మెయిన్స్: మూడో రోజు హాజరు 68.2%

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇవాళ (మూడో రోజు) జరిగిన పేపర్-2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షను 68.2% మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థుల్లో 21,429 మంది మాత్రమే హాజరయ్యారు. తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈ పరీక్షలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి.

Similar News

News October 24, 2024

సహజంగా శక్తిని అందించే ఆహార పదార్థాలేవంటే..

image

నీరసం తగ్గేందుకు లేదా శక్తి కోసం కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. దాని బదులు ప్రకృతిసిద్ధంగా లభించే ఆహార పదార్థాల్ని తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవి.. అరటిపళ్లు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్, గ్రీక్ యోగర్ట్, గుడ్లు, యాపిల్స్, చియా గింజలు, చిలగడ దుంపలు, పాలకూర. వీటిని అవసరమైనంత మేర తీసుకుంటుంటే నీరసం దరి చేరదని వారు చెబుతున్నారు.

News October 24, 2024

చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి

image

HYDలో చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది. వాల్టా చట్టం అమలుపై GHMC, అటవీ శాఖ అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమీక్షించారు. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్లు కాలనీల్లో కూలే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని ఆదేశించారు.

News October 24, 2024

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100kms వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.