News October 23, 2024
గ్రూప్ 1 మెయిన్స్: మూడో రోజు హాజరు 68.2%
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇవాళ (మూడో రోజు) జరిగిన పేపర్-2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షను 68.2% మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థుల్లో 21,429 మంది మాత్రమే హాజరయ్యారు. తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈ పరీక్షలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి.
Similar News
News November 2, 2024
భారత్ ఆలౌట్.. 28 పరుగుల ఆధిక్యం
NZతో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్సులో కివీస్ 235 రన్స్ చేయగా టీమ్ ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 90, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు.
News November 2, 2024
రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు
AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.
News November 2, 2024
‘రాజాసాబ్’లో ప్రభాస్ షర్టుపై ట్రోల్స్.. ఎందుకంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. అందులో చెక్స్ షర్టులో ఆయన కనిపించారు. అయితే, ఇదే షర్టును ‘విశ్వం’ సినిమాలో గోపీచంద్ ధరించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రెండు సినిమాల ‘బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కావడంతో ‘భారీ బడ్జెట్ అని చెప్పి ఇలా ఒకే షర్ట్‌తో మేనేజ్ చేస్తున్నారా?’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.