News March 5, 2025

అతి త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు: TGPSC

image

గ్రూప్-1 పరీక్ష ఫలితాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని TGPSC ప్రకటించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జరుగుతోందని స్పష్టం చేసింది. గ్రూప్-1 పోస్టులపై కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. మార్కుల జాబితాను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంది.

Similar News

News March 26, 2025

అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

image

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.

News March 26, 2025

అక్టోబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియా రానున్నట్లు తెలుస్తోంది. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని సమాచారం. అక్టోబరులో అక్కడ జరిగే ఓ ఎగ్జిబిషన్ మ్యాచులో అర్జెంటీనా తలపడనుంది. కాగా ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. దీంతో నేరుగా 2026 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

News March 26, 2025

తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

image

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

error: Content is protected !!