News December 17, 2024

ముగిసిన గ్రూప్-2.. సగం మంది కూడా రాయలేదు!

image

TG: గ్రూప్-2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్-3 పరీక్షకు 45.62% మంది, పేపర్-4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. కాగా మార్చి నాటికి గ్రూప్-2 ఫలితాలు వెల్లడిస్తామని TGPSC తెలిపింది.

Similar News

News December 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 10, 2025

ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఢిల్లీ <<>>కంటోన్మెంట్ బోర్డ్ 25 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MBBS,MD/MS/DM/DNB,MCh, పీజీ డిప్లొమా , ఫిజియోథెరపిస్ట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://delhi.cantt.gov.in

News December 10, 2025

వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

image

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.