News February 13, 2025

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News November 25, 2025

బలవంతపు వాంతులతో క్యాన్సర్‌: వైద్యులు

image

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.

News November 25, 2025

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

image

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News November 25, 2025

ఆంధ్ర అరటికి.. ఆజాద్‌పుర్ మండీ వ్యాపారుల హామీ

image

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్‌పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్‌పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.