News January 9, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ని రేపు(జనవరి 10) విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్ డిజైన్ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. కాగా నిన్న గ్రూప్-3 <<15099005>>‘కీ’ని<<>> టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2025
బంగ్లా ఎన్నికల నుంచి హసీనా పార్టీపై నిషేధం
మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని తమ దేశ ఎన్నికల నుంచి నిషేధిస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్‌ఫూజ్ ఆలం తెలిపారు. ‘బంగ్లా అనుకూల పార్టీలు మాత్రమే ఇకపై ఎన్నికల్లో పాల్గొంటాయి. బీఎన్‌పీ, జమాత్-ఈ-ఇస్లామ్ వంటి పార్టీలే బరిలో ఉంటాయి. ఇవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సంస్కరణలు పూర్తయ్యే వరకూ మాత్రం దేశంలో ఏ ఎన్నికా జరగదు’ అని స్పష్టం చేశారు.
News January 26, 2025
పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీరే
టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు ఐదు మందినే పద్మ పురస్కారాలు వరించాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.
News January 26, 2025
కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.