News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
Similar News
News March 11, 2025
గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఇతనే

TG: టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-2 ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 600 మార్కులకుగానూ 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ ఏడో తరగతి వరకు ఖమ్మం, 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెంలో చదివారు.
News March 11, 2025
రేవంత్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా

TG: నార్సింగి పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని CM రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగరవేశారని 2020 మార్చిలో రేవంత్‌పై కేసు నమోదైంది. అదేమి నిషేధిత ప్రాంతమేమీ కాదని, తప్పుడు కేసులు పెట్టి రేవంత్‌ను జైలుకు పంపారని ఆయన తరఫు లాయర్లు వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
News March 11, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

APలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం మారుస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.