News October 30, 2024
గ్రూప్-4 ఫలితాలు ప్రకటించండి.. అభ్యర్థుల ఆవేదన
TG: 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి దాదాపు 2 నెలలు కావొస్తుంది. నెలలు గడుస్తున్నా ఎంపికైన వారి జాబితా ఇవ్వట్లేదని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఇదే విషయమై టీజీపీఎస్సీ అధికారితో మాట్లాడినా ఇంకా ఎలాంటి ప్రకటన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తుది ఫలితాలు ప్రకటించాలని కోరుతున్నారు.
Similar News
News November 14, 2024
ఏపీ, తెలంగాణలో 3రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. HYD వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది.
News November 14, 2024
ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం US భద్రతకు కీలకం.. ట్రంప్‌తో బైడెన్
ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.
News November 14, 2024
అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి: KTR
TG: తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని KTR ట్వీట్ చేశారు. ‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? 9నెలలుగా రైతులను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో’ అని ఆయన ట్వీట్ చేశారు.