News November 14, 2024
గ్రూప్-4 రిజల్ట్స్ ఇవ్వాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్
TG: గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయొద్దని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా మరికొందరు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఫలితాలు ఆలస్యం అవుతాయని, అది కోరేవారు కొంతమందే ఉన్నారని చెబుతున్నారు. రెండేళ్లుగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఫలితాలు ఇవ్వాల్సిందేనని TGPSCని కోరుతున్నారు.
Similar News
News December 8, 2024
కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు
AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
News December 8, 2024
సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు
NDA ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థలు, జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ హస్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.
News December 8, 2024
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!
‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.