News March 7, 2025
గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల

TG: గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ను TGPSC ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేస్తామని పేర్కొంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇస్తామని తెలిపింది. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. 19న ఎక్స్టెన్సన్ ఆఫీసర్ తుది ఫలితాలు రిలీజ్ చేస్తామంది.
Similar News
News November 18, 2025
షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్కు లింకులున్నట్లు గుర్తించారు.

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.