News March 7, 2025
గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల

TG: గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను TGPSC ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేస్తామని పేర్కొంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇస్తామని తెలిపింది. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. 19న ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ తుది ఫలితాలు రిలీజ్ చేస్తామంది.
Similar News
News April 17, 2026
ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.
News April 17, 2026
సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.


