News February 17, 2025
కక్ష పెంచుకొని.. ఉన్మాదుల్లా మారి..

TG: సమాజంలో పగలుప్రతీకారాలు ప్రాణాలు బలి కోరుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అనేక మందిలో ఉన్మాదం పెచ్చుమీరుతోంది. నిన్న మేడ్చల్‌లో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు <<15482187>>అతికిరాతకంగా<<>> నరికి చంపారు. తాజాగా అదే పట్టణానికి సమీపంలోని కిష్టాపూర్‌లో మరో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో 16 ఏళ్ల బాలుడు సొంత మేనమామను పొడిచి చంపాడు. చిన్నారుల్లో ఇలాంటి నేర ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News March 26, 2025
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.
News March 26, 2025
అక్టోబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియా రానున్నట్లు తెలుస్తోంది. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని సమాచారం. అక్టోబరులో అక్కడ జరిగే ఓ ఎగ్జిబిషన్ మ్యాచులో అర్జెంటీనా తలపడనుంది. కాగా ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. దీంతో నేరుగా 2026 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.
News March 26, 2025
తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.