News December 2, 2024
రాష్ట్రంలో GST వసూళ్ల వృద్ధి

TG: రాష్ట్రంలో నవంబర్ నెలలో GST ద్వారా రూ.5,141కోట్లు వసూలైంది. గతేడాది ఇదే నెల రూ.4,986 కోట్లు ఉండగా, ప్రస్తుతం 3% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. SGST, IGSTలో SGST వాటా పంచిన తర్వాత రాష్ట్రానికి 2024-25లో రూ.29,186కోట్లు వచ్చాయి. గతేడాది కంటే ఇది 9% ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి NOV వరకు CGST, SGST, IGST, సెస్ రూపంలో మొత్తం రూ.41,065 కోట్లు వసూలైంది. అటు, APలో GST వసూళ్లు 10% తగ్గాయి.
Similar News
News February 10, 2025
జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

YCP అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 6కు వాయిదా పడింది. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరఫు లాయర్లు సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
పెళ్లి చేసుకున్న నటి

మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. ఈ క్రమంలో ఆ జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు.
News February 10, 2025
స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.