News April 1, 2025
మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.
Similar News
News April 6, 2025
జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.
News April 6, 2025
‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
News April 6, 2025
మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.