News December 1, 2024
నవంబర్‌లో 8.5% పెరిగిన GST వసూళ్లు

Novలో GST వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 8.5% పెరిగి ₹1.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ లావాదేవీలు (అన్ని రంగాల్లో) పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. CGST వసూళ్లు ₹34,141 కోట్లు, SGST ₹43,047 కోట్లు, IGST ₹91,828 కోట్లు, సెస్ ద్వారా ₹13,253 కోట్లు వసూలయ్యాయి. Nov, 2023లో ₹1.68 లక్షల కోట్లు, గత Octలో ₹1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఏప్రిల్‌లో అత్యధికంగా ₹2.10 లక్షల కోట్లు సమకూరాయి.
Similar News
News February 9, 2025
నేడే రెండో వన్డే.. జట్టులో ఎన్ని మార్పులు?

IND, ENG మధ్య కటక్ వేదికగా ఇవాళ మ.1:30 నుంచి రెండో వన్డే జరగనుంది. కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో జైస్వాల్‌ను తప్పిస్తారా? రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా? వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అతడి కోసం కుల్దీప్‌ను పక్కన పెడతారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా గెలవాలని ENG కసిగా ఉంది. sports 18-2, hotstarలో లైవ్ చూడవచ్చు. WAY2NEWS లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.
News February 9, 2025
రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.