News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.
Similar News
News March 9, 2025
4 క్యాచ్‌లు మిస్ చేసిన భారత్

CT ఫైనల్లో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కివీస్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్‌లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్తోంది. జట్టులో అద్భుతమైన క్యాచ్‌లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZ స్కోర్ 37.5 ఓవర్లకు 165/5గా ఉంది.
News March 9, 2025
రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.
News March 9, 2025
శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గిఫ్ట్

నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. విశ్వంభర సెట్స్‌లో ఆయన్ను చూసేందుకు శ్రీలీల వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చిరు ఓ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారు, వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది. శ్రీలీల తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.