News August 3, 2024

బీమాపై జీఎస్టీని తొలగించాలి: మమత

image

జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, ప్రీమియంపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. బీమాపై పన్ను ప్రజా వ్యతిరేక నిర్ణయమని, దీన్ని సమీక్షించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఊహించని కష్ట సమయాల్లో ఆర్థిక భద్రత అందించడం జీవిత, ఆరోగ్య ఇన్సూరెన్స్‌ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. వీటిపై పన్నుల వల్ల సామాన్యులు బీమాకు దూరమవుతారని చెప్పారు.

Similar News

News September 8, 2024

ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!

image

గుజరాత్‌ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. భారీ వ‌ర్షాల త‌రువాత బాధితులకు వచ్చిన తీవ్ర‌మైన జ్వ‌రాన్ని వైద్యులు క‌చ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవ‌డంలో కూడా ఇబ్బందులు ప‌డ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ స‌రిహ‌ద్దులో ఉండే ఈ తాలూకాలో స‌మ‌స్య‌ పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News September 8, 2024

నా జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయి: తమన్నా

image

టీనేజ్‌లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

News September 8, 2024

వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూష‌ణ్‌కు బీజేపీ హుకుం

image

కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగ‌ట్‌, బ‌జ‌రంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని WFI మాజీ అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌ను BJP ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెన‌క కాంగ్రెస్ కుట్ర ఉంద‌ని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్య‌లు మానుకోవాల‌ని BJP ఆదేశించడం గ‌మ‌నార్హం.