News August 8, 2024

హెల్త్ ఇన్సూరెన్స్‌పై తగ్గనున్న జీఎస్‌టీ?

image

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లకు జీఎస్‌టీ విధించడంపై ఇటీవల పార్లమెంటులో విమర్శలు వ్యక్తమైన వేళ కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. GST రేటును 18% నుంచి 5%కు తగ్గిస్తూ రేషనలైజేషన్ కమిటీకి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. అయితే జీఎస్‌టీని పూర్తిగా తొలగించేందుకు మాత్రం కేంద్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాగా జీఎస్‌టీ రేట్ రేషనలైజేషన్ కమిటీ సమావేశం ఈనెల 22న జరగనుంది.

Similar News

News April 11, 2026

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.

News April 11, 2026

IRCTC చెన్నైలో 84 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 84 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి IRCTC చెన్నైజోనల్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇచ్చింది. BSc హాస్పిటాలిటీ&హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌&క్యాటరింగ్‌ సైన్స్, సంబంధిత విభాగాల్లో BSc/BBA/MBA చేసినవారు అర్హులు. నెలకు రూ.30,000 స్టైఫండ్‌గా ఇస్తారు. వయసు 27 ఏళ్లు ఉండాలి. APR- 25, 27, 28న ఇంటర్వ్యూలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://irctc.com/new-openings.php చూడండి.

News April 11, 2026

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

image

ప్రముఖ సింగర్ మంగ్లీపై HYD పంజాగుట్ట PSలో కేసు నమోదైంది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమందితో కలిసి పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో 100 మంది నుంచి రూ.10 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం కోరుతూ వారు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. కాగా ఆ న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించడంతో అతను PSలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదైంది.