News November 12, 2024

గ్యారంటీలు ఖ‌జానాకు భార‌మే: సీఎం

image

క‌ర్ణాట‌కలో ఐదు గ్యారంటీల అమ‌లు ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం మోపుతున్నాయ‌ని సీఎం సిద్ద రామ‌య్య అంగీక‌రించారు. అయినా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఐదేళ్లూ అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 2024-25కు సంబంధించి ₹1.20 కోట్ల వార్షిక బ‌డ్జెట్‌లో ₹56 వేల కోట్లు గ్యారంటీల‌కు, ₹60 వేల కోట్లు అభివృద్ధి ప‌నుల‌కు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఇది భార‌మే అయినా ప‌థ‌కాలు ఆప‌కుండా మ్యానేజ్ చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

కరూర్ తొక్కిసలాట బాధితులతో విజయ్ భేటీ

image

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను నటుడు, TVK చీఫ్ విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్ చేసి పార్టీ నేతలు బస్సుల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బాధితులతో విజయ్ మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే.

News October 27, 2025

చిరంజీవి సినిమాలో కార్తీ!

image

చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కించనున్న సినిమాలో హీరో కార్తీ నటించనున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన గ్యాంగ్‌స్టర్ కథకు కార్తీ ఓకే చెప్పారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నట్లు టాక్. హీరోయిన్‌గా మాళవిక మోహనన్, రాశీ ఖన్నాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

News October 27, 2025

CSIR-CCMBలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 28 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://www.ccmb.res.in/