News November 12, 2024
గ్యారంటీలు ఖజానాకు భారమే: సీఎం
కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలు ప్రభుత్వ ఖజానాపై భారం మోపుతున్నాయని సీఎం సిద్ద రామయ్య అంగీకరించారు. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఐదేళ్లూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2024-25కు సంబంధించి ₹1.20 కోట్ల వార్షిక బడ్జెట్‌లో ₹56 వేల కోట్లు గ్యారంటీలకు, ₹60 వేల కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించినట్టు తెలిపారు. ఇది భారమే అయినా పథకాలు ఆపకుండా మ్యానేజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 11, 2024
టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP: పదో తరగతి పరీక్షల <
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.
News December 11, 2024
రూల్స్ ప్రకారమే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు: కేంద్రం
IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్లపై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌదరీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజర్ రూల్స్-2015 ప్రకారమే Clerkage fee వసూలు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశారని ప్రశ్నిస్తే, ఆ వివరాలు విడిగా తమ వద్ద లేవని బదులిచ్చింది.