News March 30, 2025
ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ షాక్

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఓవర్లన్నీ ఆడి 160/6 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (48), తిలక్ వర్మ (39) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా ముంబైకిది వరుసగా రెండో ఓటమి. గుజరాత్‌కు ఇదే తొలి విజయం.
Similar News
News April 1, 2025
ఇది భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం: US

భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న వేళ ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. IND 100% టారిఫ్స్ వసూలు చేస్తోందన్నారు. ఇప్పుడు తమ వంతని స్పష్టం చేశారు.
News April 1, 2025
‘మోనాలిసా’ డైరెక్టర్ అరెస్ట్.. బిగ్ ట్విస్ట్

‘మోనాలిసా’ డైరెక్టర్ <<15946962>>సనోజ్ మిశ్రా<<>> తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడు అని ఆ యువతి తెలిపారు. ఆయన్ను కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను సనోజ్‌తో ఉండటం, గొడవ పడటం వాస్తవమే కానీ.. ఎప్పుడూ ఆయన తనపై లైంగిక దాడి చేయలేదని వివరించారు.
News April 1, 2025
పీఎఫ్ విత్‌డ్రా లిమిట్ భారీగా పెంపు!

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్‌ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ రూ.5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో 7.5 కోట్ల మంది EPFO ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేస్తోంది.