News December 28, 2024

ప్రధాని మోదీని కలిసిన గుకేశ్

image

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా గుకేశ్‌కు మోదీ చెస్ బోర్డు కానుకగా అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీని కలవడం నా జీవితంలోనే అత్యుత్తమమైన క్షణం’ అని గుకేశ్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తలైవా రజినీకాంత్‌ను కూడా గుకేశ్ కలిసిన విషయం తెలిసిందే.

Similar News

News December 29, 2024

భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.5

image

AP: పలు ప్రాంతాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు కేజీ రూ.5‌కే విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు KG రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-15 వరకు పలుకుతోంది. పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతుంటే, కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2024

విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి

image

మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్య‌లు దేశ‌ ఐక్యతా భావాల‌కు పెను స‌వాల్ విసురుతున్నాయ‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజ‌రాత్‌లో ఓ ప్రోగ్రాంలో ఆయ‌న మాట్లాడుతూ ఓట్ల కోసం రాజ‌కీయ నాయ‌కులు చేసే ఈ ర‌క‌మైన రాజ‌కీయం స‌మాజంలో విభ‌జ‌న‌ను పెంచుతుంద‌న్నారు. విభ‌జ‌న సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అస‌మాన‌త‌లు, సామాజిక అన్యాయం సోద‌ర భావానికి ప్ర‌మాద‌మ‌న్నారు.

News December 29, 2024

షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

image

AP: కాకినాడలో స్టెల్లా షిప్‌లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమరవాణాపై ఏకంగా Dy.CM పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేశారు. మొత్తం 1,320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్‌లో భద్రపరిచారు. మరోవైపు షిప్‌లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.