News April 25, 2024

గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి

image

TG: భద్రాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చల్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్‌లో ఈ ఘటన జరిగింది.

Similar News

News January 21, 2025

క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!

image

TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.

News January 21, 2025

నేడు KRMB కీలక సమావేశం

image

కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ.11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణా‌బోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.

News January 21, 2025

ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు

image

AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.