News March 29, 2024
GUNTUR EAST: 3 దశాబ్దాలుగా ముస్లిం ఎమ్మెల్యేలే
AP: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింల హవా నడుస్తోంది. 1983 నుంచి ఇక్కడ వరుసగా ముస్లిం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. చివరిసారిగా 1978లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లింగంశెట్టి ఈశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత మరే హిందూ అభ్యర్థి విజయం సాధించలేదు. ఇక్కడి నుంచి ఉమర్ ఖాన్ పఠాన్, మహ్మద్ జానీ, జియావుద్దీన్, సుబానీ, మస్తాన్ వలీ, ముస్తఫా MLAలుగా ఎన్నికయ్యారు.
Similar News
News January 20, 2025
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమిటి?: కేటీఆర్
TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.
News January 20, 2025
‘అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది’
AP: విజయనగరం(D) నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సాయి మణిదీప్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అని రాసిన లేఖ వైరలవుతోంది.
News January 20, 2025
బంగాళదుంపలు రోజూ తింటున్నారా?
బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.