News September 5, 2024

గురువులంటే టార్చర్ కాదు.. మంచి ఫ్యూచర్‌నిచ్చే టార్చ్‌బేరర్స్

image

గురువులు పాఠాలు, గుణపాఠాలు, జీవిత పాఠాలు బోధిస్తారు. ఆటలు, పాటలతో పాటు పోరాటాలు చేయడమూ నేర్పిస్తారు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్నిస్తారు. టాలెంట్‌ను గుర్తించి శిక్షణనిస్తారు, తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితేనేం తమ శిష్యులను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహిస్తారు. అందుకే మంచి గురువులున్నవారి బతుకు, భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది.
✒ గురువులందరికీ HAPPY TEACHERS DAY

Similar News

News November 21, 2025

మహిళల్లో లంగ్ క్యాన్సర్‌ ముప్పు

image

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఆందోళనకరంగా పెరిగిపోతుందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోర్‌, ఔట్‌డోర్‌ వాయుకాలుష్యం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంది. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిపోతోందని, మహిళలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.

News November 21, 2025

నా ఆస్తులన్నీ పార్టీకి విరాళంగా ఇచ్చేస్తా: ప్రశాంత్ కిశోర్

image

జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే డబ్బులో 90%, ఢిల్లీలో కుటుంబం కోసం ఇల్లు మినహా 20ఏళ్లలో సంపాదించిన ఆస్తులను పార్టీకే ఇచ్చేస్తానని తెలిపారు. ప్రజలు కూడా ఏటా రూ.వెయ్యి చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. ‘JAN 15 నుంచి బిహార్ నవ్‌నిర్మాణ్ సంకల్ప యాత్ర చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని చెప్పారు.

News November 21, 2025

జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

image

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.